వాన.. హైరానా
వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఎండవేడిమి అధికంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.
మిడ్‌మానేరుకు ఇన్‌ఫ్లో
బోయినపల్లి: మిడ్‌మానేరులోకి మానేరు, మూలవాగు నుంచి మంగళవారం 1,312 క్యూసెక్కుల వరద చేరుతోంది. ప్రాజెక్టులో నీటిమట్టం 27.27 టీఎంసీలకు చేరింది.
చిత్రంలో వర్షానికి తడిసిన ధాన్యాన్ని చూపిస్తున్న రైతు గోపాల్‌పూర్‌కు చెందిన అనుముల మహేందర్. రెండు రోజుల క్రితం నాలుగు ఎకరాల పొలాన్ని హార్వెస్టర్‌తో కోయించాడు. ట్రాక్టర్లలో ధాన్యాన్ని దుర్శేడ్ కొనుగోలు కేంద్రానికి తరలించి ఆరపెడుతున్నాడు. మంగళవారం వేకువజామున కురిసిన భారీ వర్షానికి ధాన్యమంతా తడిసిపోయింది. మహేందర్ ఒక్కడి కష్టమే కాదు.. జిల్లా మొత్తం ఇదే పరిస్థితి.
కరీంనగర్‌రూరల్/శంకరపట్నం/గన్నేరువరం/జమ్మికుంట/మానకొండూర్/హుజూరాబాద్‌రూరల్: మోంథా తుపాన్ ప్రభావం తగ్గిపోయిందని ఆనందపడిన రైతులను అకాల వర్షం హైరానా పడేలా చేస్తోంది. కల్లాల్లో ధాన్యం ఉండడంతో కమ్ముకుంటున్న మేఘాలు కంటి మీదు కునుకులేకుండా చేస్తున్నాయి. పంట చేతికొచ్చే దశలో తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరి నేలకొరిగింది. వారంరోజులుగా పొలంలో నీళ్లు ఉండటంతో పంట కోసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలాగోలా కోస్తే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరపెట్టేందుకు పాట్లు పడుతున్నారు. మంగళవారం వేకువజామున కురిసిన వర్షం రైతుల నోట్లో మట్టికొట్టింది. ఒక్కసారిగా పడిన వానతో కరీంనగర్ మండలంలోని దుర్శేడ్, గోపాల్‌పూర్ కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. కేశవపట్నం వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కుప్పలపై వర్షం నీరు చేరింది. అర్కండ్ల, కన్నాపూర్, మెట్‌పల్లి గ్రామాల్లో నష్టపోయిన పంటను ఏవో వెంకటేశ్ పరిశీలించారు. గన్నేరువరం మండలం జంగపల్లి కొనుగోలు కేంద్రంలో వడ్లు కొట్టుకపోయాయి. జమ్మికుంట పాత వ్యవసాయ మార్కెట్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొట్టుకపోయింది. తడిసిన ధాన్యం కుప్ప చేసుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమించారు. మానకొండూర్ మండలంలోన పలు గ్రామాల్లో ఉదయం, మధ్యాహ్నం వర్షం దంచికొట్టడంతో ధాన్యం తడిసిపోయింది. హుజూరాబాద్ మండలం సిర్సపల్లి, వెంకట్రావుపల్లి, పోతిరెడ్డిపేట గ్రామాల్లో ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయాయి. ‘చేతికొచ్చిన పంట కొట్టుకుపోయింది. ఇప్పుడు అప్పులెలా తీర్చాలి? కుటుంబాన్ని ఎలా పోషించాలి?’ అంటూ పోతిరెడ్డిపేటకు చెందిన రైతు కన్నీరు పెట్టుకున్నాడు.
కరీంనగర్ రూరల్: నగునూరులో
ధాన్యంపై కప్పిన టార్పాలిన్లు
జమ్మికుంట: మార్కెట్లో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కుప్పగా పోస్తున్న రైతు
వాన.. హైరానా
వాన.. హైరానా
వాన.. హైరానా
వాన.. హైరానా


