పట్టపగలు సిటీలోకి..
ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య నగరంలోకి భారీ వాహనాల ప్రవేశం నిషేధం. పొద్దంతా ట్రాఫిక్‌కు ఇబ్బంది ఎదురవుతుందని పోలీసులు భారీ వాహనాలను సిటీలోకి అనుమతించరు. అయితే ఇటీవల నగరంలోకి భారీ వాహనాలు సులువుగా ప్రవేశిస్తున్నాయి. రద్దీ ప్రాంతాల్లో యథేచ్ఛగా తిరుగుతున్నాయి. కట్టడి చేయాల్సిన ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోకపోగా.. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. భారీ వాహనాలను సిటీలోకి రాకుండా నియంత్రించాలని కోరుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్


