బ్రహ్మపుష్కరిణికి కార్తీకశోభ
ధర్మపురి: ధర్మపురి నృసింహస్వామివారి బ్రహ్మపుష్కరిణి కార్తీకశోభను సంతరించుకుంది. కార్తీకమాసంలో పౌర్ణమి వేడుకలను బుధవారం మహావైభవంగా నిర్వహించేందుకు ఆలయ ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోనేరులోని నలుదిక్కులను శుభ్రం చేశారు. నలువైపులా ఐదు వేల దీపాలు వెలిగించనున్నారు. వేలాది మంది భక్తులు పంచ సహస్ర దీపోత్సవ వేడుకలను తిలకించనున్నారు. శ్రీలక్ష్మినృసింహస్వామి ఉత్సవమూర్తులకు కోనేరులోని భోగ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కార్యక్రమానికి సుమారు 50వేల మంది భక్తులు వస్తారని అంచనా మేరకు లడ్డూ, ప్రసాదం, పులిహోరా అందుబాటులో ఉంచామని ఆలయ అధికారులు తెలిపారు.
నేడు కోనేరులో పంచ సహస్ర దీపోత్సవం


