కరీంనగర్ కార్పొరేషన్: పీసీసీ పిలుపు మేరకు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి దిష్టిబొమ్మలను తెలంగాణచౌక్‌లో దహనం చేశారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పురుమల్ల శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, ఆరెపల్లి మోహన్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొరివి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ ఇటీవల అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్ కుమార్‌తో ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఏకవచనంతో మాట్లాడి సభా మర్యాదను మంటగలిపారని అన్నారు. గతంలో ఎమ్మెల్యే సంపత్ కుమార్‌ను అసెంబ్లీ నుంచి బర్తరఫ్ చేశారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక దళిత నాయకున్ని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేశారని అన్నారు. ఇప్పటికై నా పద్దతి మార్చుకోకపోతే బీఆర్‌ఎస్ నాయకులను తరిమికొట్టే రోజు వస్తుందని హెచ్చరించారు. గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, ఆకారపు భాస్కర్‌రెడ్డి, కర్ర రాజశేఖర్, గడ్డం విలాస్‌రెడ్డి, సమద్ నవాబ్, దండి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.