‘మాదిగలకు ద్రోహం చేసిన కాంగ్రెస్‌ పార్టీ’ | Sakshi
Sakshi News home page

‘మాదిగలకు ద్రోహం చేసిన కాంగ్రెస్‌ పార్టీ’

Published Tue, Apr 23 2024 8:10 AM

- - Sakshi

హుజూరాబాద్‌: మాదిగల రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్‌ పార్టీ నమ్మించి ద్రోహం చేసిందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ అన్నారు. సోమవారం రాత్రి హుజురా బాద్‌లో ఎమ్మార్పీఎస్‌ ఎంఎస్పీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. మాట ఇచ్చి మోసం చేయడంలో కాంగ్రెస్‌ పార్టీ ఆరితేరిందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మూడు,నాలుగు సీట్లు రావాల్సి ఉండగా ఒకటి కూడా ఇవ్వకుండా కాంగ్రెస్‌ అధిష్టానం, సీఎం రేవంత్‌రెడ్డి కక్షపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. రెడ్డిలకు ఆరుసీట్లు, 50శాతం పైన ఉన్న బీసీలకు రెండు సీట్లు ఇచ్చారని అన్నారు. కేసీఆర్‌ నియంతృత్వంతో మాదిగలు నష్టపోయారని, అందుకే ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఎవరూ ఓటు వేయద్దని సూచించారు. బీజేపీ తమ సమస్యలు పరిష్కరించేందుకు హామీ ఇచ్చిందని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకే మద్దతు ఇచ్చామని అన్నారు. నాయకులు రుద్రారపు రామచంద్రం, మారెపల్లి శ్రీనివాస్‌, తునికి వసంత్‌, వెంకట్‌ స్వామి, డాక్టర్‌ తడికమళ్ల శేఖర్‌, బొరగల సారయ్య, రాజు పాల్గొన్నారు.

ఏజీని కలిసిన బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌

కరీంనగర్‌క్రైం: రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్‌ జనరల్‌ బి.సుదర్శన్‌ రెడ్డిని కరీంనగర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పీవీ.రాజ్‌ కుమార్‌ సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి బొకే అందజేశారు. న్యాయవాదులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.2లక్షల ఇన్సూరెన్స్‌ను రూ.5లక్షలకు పెంచాలని, కొత్త సభ్యులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలని, జూనియర్‌ న్యాయవాదులకు నెలకు రూ.5వేల స్టైఫండ్‌ ఇవ్వాలని వినతిపత్రం అందించగా.. సానుకూలంగా స్పందించారు.

మున్సిపల్‌ కాంట్రాక్టర్ల సంఘం కన్వీనర్‌గా మహేందర్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: మున్సిపల్‌ కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం కన్వీనర్‌గా దగ్గు మహేందర్‌ రాకేశ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహేందర్‌ కన్వీనర్‌గా ఎన్నికవడం వరుసగా ఇది రెండోసారి. కాంట్రాక్టర్లకు సంబంధించిన సమస్యలను అధికారుల సహకారంతో పరిష్కరిస్తానని ఈ సందర్భంగా మహేందర్‌ తెలిపారు. తన నియామకానికి సహకరించిన సహచర కాంట్రాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం మేయర్‌ యాదగిరి సునీల్‌రావును మహేందర్‌ రాకేశ్‌ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లు మర్యాదకపూర్వకంగా కలిశారు. మహేందర్‌కు మేయర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ
1/2

మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ

దగ్గు మహేందర్‌
2/2

దగ్గు మహేందర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement