రామారెడ్డి(ఎల్లారెడ్డి): పేద ఇంటి ఆడ పిల్లల పెళ్లిలకు అండగా ఉంటామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ అన్నారు. మద్దికుంట గ్రామానికి చెందిన కట్ట స్వప్న వివాహం సోమవారం మద్దికుంట శివాలయం ఆలయ ప్రాంగణంలో జరిగింది. ఈవేడుకకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి హాజరై పుస్తె మట్టెలు వితరణ చేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. రామారెడ్డి సర్పంచ్ బండి ప్రవీణ్, ఉప సర్పంచ్ నవీన్, డీసీసీ జనరల్ సెక్రెటరీ, జూలూరి సుధాకర్, కామారెడ్డి జిల్లా సేవాదళ్ అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్, గడ్డ మీది మహేశ్, మాజీ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్, కోటి, పండు శ్రీకాంత్, శశి మున్ను,రాహుల్, ఆకాష్,ఉన్నారు.


