నిజాంసాగర్ : డ్రంక్ అండ్ డ్రైవ్‌తో పాటు రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. సోమవారం మండలంలోని బొగ్గుగుడిసె చౌరస్తాతో పాటు చౌరస్తా సర్కిల్ పరిధిలోని బాన్సువాడ– ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై నాలుగు బృందాలుగా పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహనాల ధ్రువపత్రాలు తనిఖీ చేశారు. వాహనాలపై పెండింగ్‌లో ఉన్న బకాయిలను వసూలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయించారు. ద్విచక్రవాహనదారులు హెల్మట్ తప్పనిసరిగా ధరించాలని ప్రత్యేక పోలీస్ ఎస్సై సాయి సూచించారు.


