చంచల్‌గూడ: నిజామాబాద్‌కు చెందిన ఓ ఖైదీని ఇటీవల కంటి చికిత్స కోసం చంచల్‌గూడ జైలుకు తరలించగా, అక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా.. నిజామాబాద్‌కు చెందిన కంది రాజు(30) చోరీ, ర్యాష్ డ్రైవింగ్ సహ వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. నిజామాబాద్ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండగా.. జూలైలో కంటి చికిత్స కోసం అతన్ని హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించారు. సాధారణ ములాఖత్‌లో భాగంగా రాజు సోమవారం చికిత్సకు వెళ్లే ముందు భార్యతో ఫోన్ ద్వారా మాట్లాడాడు. అనంతరం అతడు బాత్‌రూమ్‌లో టవల్‌తో ఉరేసుకొని ఆత్మహ త్యకు పాల్పడ్డాడు. బాత్‌రూమ్‌లోంచి రాజు ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో తోటి ఖైదీలు గమనించి సిబ్బందికి తెలిపారు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. రాజు ఆత్మహత్య విషయాన్ని జైలు అధికారులు కుటుంబ సభ్యులకు తెలిపారు.
సిరికొండ: సిరికొండ అటవీశాఖ రేంజ్ పరిధిలోని తాటిపల్లి బీట్ అటవీ ప్రాంతంలో అక్రమంగా భూ ఆక్రమణకు ప్రయత్నించిన గ్రా మానికి చెందిన భూక్యా మోహన్‌పై కేసు న మోదు చేసినట్లు సిరికొండ ఎఫ్‌ఆర్‌వో నర్సింగరావు సోమవారం తెలిపారు. మోహన్‌ను సిరికొండ తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రస్తుతం అటవీ భూములకు ఎలాంటి హక్కులు కల్పించడం లేదని, కావున ఎవరు కూడా అటవీ భూముల ఆక్రమ ణకు పాల్పడవద్దని ఎఫ్‌ఆర్‌వో సూచించారు.
వర్ని: చందూర్ మండలం ఘన్‌పూర్ అటవీ ప్రాంతం నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా టిప్పర్లలో మొరం తరలిస్తుండగా పట్టుకున్నట్లు చందూర్ తహసీల్దార్ వీర్‌సింగ్ సోమ వారం తెలిపారు. అనుమతులు లేకుండా ఆరు టిప్పర్లలో మొరం తరలిస్తుండగా పట్టుకొని కార్యాలయానికి తరలించినట్టు వివరించారు. వాహనాలతోపాటు యజమాని, డ్రైవర్‌పై కేసులో నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు.
బోధన్ మండలంలో..
బోధన్ రూరల్: మండలంలో మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు రూరల్ ఎస్సై రాజశేఖర్ సోమవారం తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వివరించారు.
జిల్లా కేంద్రం నుంచి తరలివెళ్తున్న నేతలు


