ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్‌ బోధన | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్‌ బోధన

Sep 1 2026 1:13 AM | Updated on Sep 1 2026 1:13 AM

70 మంది బోధకులను

నియమించిన ప్రభుత్వం

కంప్యూటర్‌ నేర్చుకోవడంపై

ఆసక్తి చూపుతున్న విద్యార్థులు

ఎల్లారెడ్డిరూరల్‌: విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు, పాటలు, యోగా, మ్యూజిక్‌ తరగతులతో పాటు కంప్యూటర్‌ శిక్షణను సైతం ప్రభుత్వం అందిస్తోంది. దీంతో విద్యార్థులు చదువుతో పాటు కంప్యూటర్‌ నేర్చుకోవడంలో ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు.

వారానికి మూడు రోజుల చొప్పున ...

జిల్లాలోని 140 ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్యా బోధన జరుగుతుంది. ఇటీవలే ప్రభుత్వం 70 మంది కంప్యూటర్‌ ఉపాధ్యాయులను ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో నియమించింది. వీరు వారానికి మూడు రోజుల చొప్పున ఒక పాఠశాలలో విద్యార్థులకు కంప్యూటర్‌ విద్యాబోధన చేయాల్సి ఉంటుంది.

సైబర్‌క్రైమ్‌, కోడింగ్‌ విధానాలు ...

పాఠశాలల్లో విద్యార్థులు కంప్యూటర్‌ పాఠాలపై ఆసక్తిని కనబరుస్తున్నారు.విద్యార్థులకు కంప్యూటర్‌ బేసిక్స్‌తో పాటు ఏఐ, సైబర్‌క్రైమ్‌, కోడింగ్‌ విధానానికి సంబంధించిన పాఠ్యాంశాలు డిజిట ల్‌ లెర్నింగ్‌ను నేర్చుకుంటున్నారు. కంప్యూటర్‌ ఉపాధ్యాయులను నియమించడంతో పాఠశాలల్లోని కంప్యూటర్లు వినియోగంలోకి వచ్చాయి. విద్యార్థులు పాఠాలను నేర్చుకుంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement