నిజామాబాద్ రీజియన్ పరిధిలోని ఆదాయం వివరాలు
సిబ్బంది సహకారంతో..
నిజామాబాద్ రూరల్: ఆర్టీసీకి రాఖీ పండుగ ఆదాయం తెచ్చిపెట్టింది. పండుగను పురస్కరించుకొని ఆగస్టు 27, 28, 29 తేదీల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపింది. దీంతో మూడు రోజుల్లో సుమారు రూ.5 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ప్రతిరోజూ నడిచే బస్సులతోపాటు ప్రత్యేక బస్సులను నడిపి ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా చూసింది. నిజామాబాద్ రీజియన్ పరిధిలో నిజామాబాద్–1, 2 డిపోలతోపాటు ఆర్మూర్, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ డిపోలు ఉన్నాయి. ఈ డిపోల పరిధిలో ఆర్టీసీకి మొత్తం 655 బస్సులున్నాయి. వీటితోపాటు 27వ తేదీన 83 ప్రత్యేక బస్సులు, 28న 90, 29న 43 బస్సులు నడిపారు. రోజుకు 2.59 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడపగా, రాఖీ పండుగ సందర్భంగా అదనంగా 27న 10 వేలు, 28న 28 వేలు, 29న 10 వేల కిలోమీటర్లు నడిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించారు.
తేదీ తిరిగిన వచ్చిన
కిలోమీటర్లు ఆదాయం(రూ.)
27 2.69(లక్షలు) 176.74(లక్షలు)
28 2.82(లక్షలు) 207.89(లక్షలు)
29 2.68(లక్షలు) 162.08 (లక్షలు)
రీజియన్ పరిధిలోని డ్రైవర్లు, కండక్టర్లు, డిపో మేనేజర్లు ఇతర సిబ్బంది కృషితో ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా బస్సులు నడిపాం. రాఖీ పండుగ రద్దీ రోజుల్లో ప్రత్యేక బస్సుల నిర్వహణ ద్వారా రీజియన్‌లో బ్రేక్ ఇవెన్ సాధించింది.
– కృష్ణమూర్తి, రీజినల్ మేనేజర్
మూడు రోజుల్లో రూ.5 కోట్లకు పైగా ఆదాయం
రీజియన్ పరిధిలో 655 బస్సులు
పండుగ వేళ అదనంగా
ప్రత్యేక బస్సులు నడిపిన సంస్థ


