సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/నిజామాబాద్ అర్బన్: ప్రజా సమస్యలపై పోరాడుతూనే పార్టీ నిర్మాణం చేపడతానని, పార్టీ పెట్టిన నాలుగు నెలల తరువాత సొంత గడ్డకు రావడం ఎంతో సంతోషంగా ఉందని కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పాంచజన్య సంకల్పసభలో ఆమె మాట్లాడారు. జిల్లా లోని ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అవినీతిపై పోరాటం చేస్తామన్నారు. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పదవుల కోసం కాకుండా ప్రజల కోసమే పార్టీని స్థాపించానని స్ప ష్టం చేశారు. తాను ఏం తప్పు చేశానని తీహార్ జైలు లో పెట్టారని, తనను అన్యాయంగా జైలులో పెట్టా రని కవిత కన్నీరు పెట్టుకున్నారు. కన్నీరు పెట్టినంత మాత్రాన తాను పిరికిదాన్ని కాదని, సమస్యలపై పోరాటం చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యిరోజులు అవుతున్నా ఒక్క హామీ అమలు చేయలేదని, రైతు భరోసా, రైతులు ఆగమయ్యారన్నారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని కేటీఆర్ స్నేహితుడు కోరుట్ల ఎమ్మెల్యే కోసమే తెరిపించలేదన్నా రు. ఆయనకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరిగాయని కవిత ఆరోపించారు. నిజాం షుగర్స్‌ను తిరిగి తెరిపించే వరకు రైతుల మద్దతుగా ఉంటానన్నారు. సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ కోసం ధర్నా చేస్తున్న కార్మికులకు మద్దతిస్తున్నామని, అవసరమైతే పోరాటం చేస్తామన్నారు.
ప్రశాంత్‌రెడ్డిని క్షమించేది లేదు..
కేసీఆర్ మాదిరిగా ఉండేందుకు ప్రశాంత్‌రెడ్డి ప్రయ త్నిస్తాడని, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే కుదురుతుందా అని విమర్శించారు. తండ్రీ కూ తురిని విడదీయంలో ప్రశాంత్‌రెడ్డిది మొదటి పాత్ర అని.. ఆయనను క్షమించే ప్రసక్తేలేదని కవిత అన్నా రు. తన ఉసురు ప్రశాంత్‌రెడ్డికి తగులుతుందన్నా రు. బీఆర్‌ఎస్ ఓడిపోయిన రెండో రోజే కాంగ్రెస్‌లో కి వెళ్లేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. బా జిరెడ్డి గోవర్ధన్, జీవన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డిని తాను గెలిపిస్తే వారు నన్ను ఓడించారన్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ పేరులోనే ధర్మం ఉందని, కానీ ఆయనలో మొత్తం అధర్మమేనని కవిత విమర్శించారు. మాధవ్ నగర్ బ్రిడ్జిని ఏడేళ్లుగా ఎందుకు కట్టించలేకపోతున్నారని ప్రశ్నించారు.
మీపై ఆశతోనే ముందుకు వెళ్తున్నా
ఇక్కడి నుంచి పుట్టిన
రాజకీయ పార్టీ చరిత్రలో నిలవాలి
నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కోసం
పోరాటం ఆపను
‘పాంచజన్య సంకల్ప సభ’లో టీఆర్‌ఎస్
అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత


