గణేశ్‌ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి | - | Sakshi
Sakshi News home page

గణేశ్‌ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి

Sep 1 2026 1:07 AM | Updated on Sep 1 2026 1:07 AM

డీజేలకు అనుమతి లేదు..

వదంతులు నమ్మొద్దు

ఎస్పీ రాజేశ్‌చంద్ర

కామారెడ్డి టౌన్‌: జిల్లాలో జరిగే గణేశ్‌ ఉత్సవాలు, శో భాయాత్రలను భక్తిశ్రద్ధలు, సోదరభావంతో సురక్షితంగా నిర్వహించుకోవాలని ఎస్పీ ఎం.రాజేశ్‌చంద్ర తెలిపారు. జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో రెవెన్యూ, మున్సిపల్‌, విద్యుత్‌ శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సోమవారం గ ణేశ్‌ ఉత్సవాల సన్నాహక, భద్రతా ఏర్పాట్లపై విస్తృత సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భిన్నత్వంలో ఏకత్వానికి ప్ర తీకగా నిలిచే ఈ పండుగలో ఆనందమే ఉండాలని, వి షాదాలకు తావుండకూడదని అన్నారు. విగ్రహాల రవాణా సమయంలో విద్యుత్‌ తీగలు తగిలి ప్రాణనష్టం, గాయాలై విషాద ఘటనలను జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండపాల వద్ద సీసీటీవీ కెమెరాలు, రాత్రివేళల్లో నిర్వాహకు లు కాపలా ఉండాలన్నారు. ట్రాఫిక్‌కు ఆటంకం లే కుండా స్టేజీలు ఏర్పాటు చేయాలన్నారు. విగ్రహాల ఎ త్తు, వాహనాల పరిమాణం, రోడ్లపై విద్యుత్‌ తీగల పరిస్థితిని ముందుగానే గమనించాలని అన్నారు. వ ర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నిపుణుల ద్వారా వి ద్యుత్‌ వైరింగ్‌ చేయించాలని, మండపాల వద్ద ఫైర్‌ ఎ క్స్టింగ్విషర్లు, నీటి బకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని తె లిపారు. మండపాల వద్ద డీజేలు నిషేధమని, మద్యపానం, పేకాట, అసభ్యకర కార్యక్రమాలకు తావులేదన్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే రెచ్చగొట్టే సందేశా లు, వదంతులను నమ్మవద్దన్నారు. ప్రతి మండపం వ ద్ద పోలీస్‌ పాయింట్‌ బుక్‌ ఏర్పాటు చేస్తామని, అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్‌ 100 కు సమాచారం ఇవ్వాలని, మండపాల నిర్వాహకులు పోలీస్‌ శాఖకు పూర్తిగా సహకరించాలని సూచించా రు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) విక్టర్‌, అదనపు ఎస్పీ కె.నరసింహారెడ్డి, డీఎస్పీలు మ ధుసూదన్‌, శ్రీనివాస్‌ రావు, విఠల్‌ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement