శ్రీకృష్ణుడిని, ఆయన చేతిలోని పాంచజన్యాన్ని నమ్ముకున్న వాళ్లు ఓడిపోయినట్లు చరిత్రలో లేదని కవిత అన్నారు. పాంచజన్యం పేరునే టీఆర్‌ఎస్ ఐదు అంశాలకు పెట్టామన్నారు. ఉచిత విద్య, వైద్యం, యువతకు ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం ఐదు అంశాలను సంకల్పంగా తీసుకుని ముందుకు వెళ్తామన్నారు. యువతకు రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉపాధి రుణాలు, భూమిలేని పేదలకు భూలక్ష్మి పేరుతో ఎకరం భూమి అందిస్తామన్నారు. ప్రజల జీవితాల్లో గుణ్మాతక మార్పు తీసుకరావాలన్న సంకల్పంతో ముందుకు వచ్చానన్నారు. సభలో టీఆర్‌ఎస్ నాయకులు నవీన్ ఆచారి, అవంతిరావు, లక్ష్మీనారాయణ భరద్వాజ్, విజయలక్ష్మి, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


