సదాశివనగర్ : మండల కేంద్రంతో పాటు అమర్లబండ, ధర్మారావ్‌పేట్, లింగంపల్లి, భూంపల్లి, కుప్రియాల్, పద్మాజీవాడి, తుక్కోజీవాడి, తిమ్మోజీవాడి తదితర గ్రామాల్లోని ఆలయాల్లో శుక్రవారం శ్రావణమాస భజనలు కొనసాగుతున్నాయి. శ్రావణమాసంలో భాగంగా గ్రామంలో 21 రోజుల పాటు నిత్యభజన కార్యక్రమం చేపడుతున్నట్లు సర్పంచ్ పేర్కొన్నారు.సర్పంచ్ సుబ్బారావు, ఉప సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి, భజన మండళ్ల ప్రతినిధులు తిరుపతి, రాజిరెడ్డి, నాగాగౌడ్, కొప్పుల నర్సారెడ్డి, పెసరి భూమయ్య, పెద్ద బాబయ్య, రాజిరెడ్డి, రాందాస్, తదితరులు పాల్గొన్నారు.


