పెద్దకొడప్‌గల్: మండలంలోని రోడ్లు గుంతలతో అధ్వానంగా మారాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రం నుంచి అంజని గ్రామం మీదుగా విఠల్ వాడి తండా వరకు, అలాగే సముందర్ తండా నుంచి మండల కేంద్రం వరకు,పెద్ద దేవిసింగ్ తండా నుంచి బేగంపూర్ చౌరస్తా వరకు ఉన్న ప్రధాన రోడ్లపై భారీ గుంతలు ఏర్పడ్డాయి.
ప్రమాదాల భయం..
రోడ్డుపై గుంత ఎక్కడ ఉందో తెలియక వాహనదారులు అదుపు తప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు. రాత్రి వేళలో ప్రయాణం మరింత ఇబ్బందికరంగా మారింది. ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.లేనిచో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు.
పెద్దకొడప్‌గల్ మండలంలో
అధ్వానంగా మారిన వైనం
ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
అధికారులు, ప్రజాప్రతినిధులు
స్పందించాలని వినతి


