‘కోఆప్షన్‌’కు 17 నామినేషన్లు | - | Sakshi
Sakshi News home page

‘కోఆప్షన్‌’కు 17 నామినేషన్లు

Apr 22 2026 7:36 AM | Updated on Apr 22 2026 7:36 AM

నేటి సాయంత్రంతో ముగియనున్న గడువు

కామారెడ్డి టౌన్‌ : కామారెడ్డి మున్సిపల్‌ కోఆప్షన్‌ స భ్యుల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం 5 గంటలతో ప్రక్రియ ముగియనుంది. మంగళవారం నాటికి మొత్తం 17 నామినేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. సోమవారం రెండు దరఖాస్తులు రాగా, మంగళవారం ఒక్కరోజే 15 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇప్పటివరకు మైనారిటీ విభాగం నుంచి 12 మంది (ఏడుగురు పురుషులు, ఐదుగురు మహిళలు) నామినేషన్‌ వేయగా, జనరల్‌ (నాన్‌ మైనారిటీ) విభాగంలో 5 నామినేషన్లు (ఒకరు పురుషుడు, నలుగురు మహిళలు) వచ్చాయి. కోఆప్షన్‌ సభ్యత్వాలకు నామినేషన్‌ దాఖలు గడువు బుధవారం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది.

Advertisement
 
Advertisement
Advertisement