కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్‌లో ఈ నెల 24న సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న గాంధీ గంజ్ బస్తీ హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని బస్తీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిలువేరు మారుతి, కళ్యాణ్‌లు కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్, గాంధీ గంజ్, అయ్యప్ప నగర్, గాంధీ నగర్, గోదాం రోడ్డు తదితర ప్రాంతాలలో వారు విస్తృతంగా పర్యటించారు. ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేస్తూ, జెండాలను కడుతూ సమ్మేళనంపై ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో దేశవ్యాప్తంగా బస్తీ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


