లింగంపేట(ఎల్లారెడ్డి): వడదెబ్బ తగలకుండా ఉపాధి హామీ కూలీలు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసుల వద్ద కాపలాగా ఉంటున్న రైతులకు మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండలంలోని మోతె, పర్మళ్ల, భవానిపేట, లింగంపేట తదితర గ్రామాల్లో రైతులు, కూలీలకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. వడదెబ్బతో జ్వరం, వాంతులు, విరేచనాలు అవడం, గుండెపోటు, అస్వస్తతకు గురికావడం తదితర లక్షణాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. నీళ్లు ఎక్కువగా తాగాలని సూచించారు.


