ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి

Apr 22 2026 7:18 AM | Updated on Apr 22 2026 7:18 AM

కామారెడ్డి టౌన్‌: ప్రజలకు అత్యవసర సమయంలో అంబులెన్స్‌ ద్వారా మరింత వేగంగా, నాణ్యమైన సేవలు అందించాలని 108, 102, 1962, నియోనెటల్‌ అంబులెన్స్‌ల జిల్లా క్వాలిటీ ఆడిటర్‌ ఎస్‌కే ఫయాజ్‌ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో అంబులెన్సులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాల్లోని ఔషధాల నిల్వలు, మెడికల్‌ పరికరాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అంబులెన్సుల కండిషన్‌ బాగుండాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లా మేనేజర్‌ తిరుపతి, పైలట్లు విజయ్‌, రోహిత్‌, ఈఎంటీలు కృష్ణస్వామి, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement