తాడ్వాయి(ఎల్లారెడ్డి): విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికావద్దని ప్రముఖౖ సెకియాట్రిస్టు రమణ అన్నారు. తాడ్వాయి బాలికల గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. మానసికంగా బాధపడుతున్న వారిని ప్రత్యేక చికిత్స, కౌన్సిలింగ్ ద్వారా నయం చేయవచ్చన్నారు. మానసిక రోగులను గుర్తించి జిల్లాకేంద్రంలో చూపించినట్లయితే ఉచితంగా సలహాలు, మందులను ఇస్తారన్నారు. ప్రిన్సిపల్ సురేఖ, సైకియాట్రిస్టు రాహుల్, దోమకొండ ఎస్సై దీపిక, తదితరులు పాల్గొన్నారు.


