ఎస్‌జీటీని నియమించండి | - | Sakshi
Sakshi News home page

ఎస్‌జీటీని నియమించండి

Apr 22 2026 7:18 AM | Updated on Apr 22 2026 7:18 AM

ఎస్‌జీటీని నియమించండి

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): ధర్మారావ్‌పేట్‌ ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీని నియమించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఎంఈవో యోసెఫ్‌కు వార్డు సభ్యులు గౌస్‌, సాయిలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...పాఠశాలలో 125 మంది విద్యార్థులు ఉన్నారని, కేవలం నలుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారని, ఒక పీఈటీ, మరో ఇద్దరు విద్యావాలంటీర్లను నియమించి విద్యార్థులకు విద్యనందిస్తున్నామన్నారు. పీఈటీకి, ఇద్దరు వీవీలకు పేరెంట్స్‌ నుంచి ప్రతి నెలా డబ్బులు వసూలు చేసి వారికి వేతనాలు ఇవ్వాల్సి వస్తోందన్నారు. ఈ విధానం వల్ల ప్రతి నెలా ఇబ్బంది అవుతోందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement