కామారెడ్డి టౌన్: తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తానని యూనివర్సిటీ పాలకమండలి నూతన సభ్యుడు మహమ్మద్ ఘాజీ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కర్షక్ బీఈడీ కళాశాల లో ఆయనకు ఏర్పాటు చేసిన అభినందన సభలో మాట్లాడారు. యూనివర్సిటీలో నెలకొన్న సమస్య ల పరిష్కారానికి ప్రభుత్వం, విశ్వవిద్యాలయానికి మధ్య వారధిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రిన్సిపల్ ఎస్‌కే రషీద్, కిషన్, బీమాగౌడ్, బీఈడీ విద్యార్థులు పాల్గొని ఘాజీని సన్మానించారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఇటీవల వెలువడిన ఇంటర్ పరీక్షా ఫలితాలలో 970 మార్కులు సాధించి నాగిరెడ్డిపేట మండల టాపర్‌గా నిలిచిన మాల్తుమ్మెదతండాకు చెందిన హారికను మంగళవారం స్థానిక ఎస్సై భార్గవ్‌గౌడ్ పోలీస్‌స్టేషన్‌లో ఘనంగా సత్కరించారు. హారికకు ఉద్యోగం వచ్చేవరకు ఆమె చదువులకు అయ్యే ఖర్చులను తానే భర్తిస్తానని ఈ సందర్భంగా ఎస్సై పేర్కొన్నారు. అనంతరం ఎంట్రన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి రూ.3 వేల నగదును అందజేశారు. హెడ్ కానిస్టేబుల్ మనోహార్, కానిస్టేబుల్ అర్చన ఉన్నారు.
కామారెడ్డి అర్బన్: రోజు రోజుకు భూతాపం పెరిగిపోతున్నందున పర్యావరణ సమతుల్యానికి ప్రతిఒక్కరు బాధ్యతగా కృషి చేయాలని జిల్లా పర్యావరణ క్లబ్ సమన్వయకర్త విద్యాసాగర్ అన్నారు. మంగళవారం స్థానిక బీఎడ్ కళాశాల ఆధ్వర్యంలో ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఊరేగింపు నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన విద్యాసాగర్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. మొక్కుబడి కాకుండా మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వాడకం తగ్గించడం తమవంతు విధిగా ఉండాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ ఎంఏ రషీద్, వైస్ ప్రిన్సిపల్ కిషన్ అధ్యాపకులు పాల్గొన్నారు.
భిక్కనూరు: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను ఏఈవోలు మంగళవారం పరిశీలిలంచారు. క్షేత్రస్థాయిలో తిరిగి పంట నష్టాన్ని అంచనా వేశారు. ఏఈవోలు వినోద్‌గౌడ్, లిఖిత్‌రెడ్డి, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: విద్యార్థుల్లో సృజనాత్మకత, జ్ఞా నాత్మక నైపుణ్యాలను పెంపొందించడానికి చెస్ బో ర్డులను అందజేస్తున్నట్టు చెస్ నెట్‌వర్క్ అసోసియేషన్ వ్యవస్థాపకులు సుధీర్ కోదాటి అన్నారు. మంగళవారం చిన్నమల్లారెడ్డి జెడ్పీహెచ్‌ఎస్‌కు సుధీర్ కోదాటి చెస్ బోర్డులను అందజేశారు. చెస్ నెట్‌వ ర్క్ అసోసియేషన్ ప్రతినిధి ఎస్.నారాయణ, హెడ్ మాస్టర్ సాయిరెడ్డి, వార్డు సభ్యులు, టీచర్లు, చెస్ వాలంటీర్ హెచ్.అరుణ్‌రావు పాల్గొన్నారు.


