తాడ్వాయి(ఎల్లారెడ్డి): తెలంగాణ జాగృతి పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆ పార్టీ మండల అధ్యక్షుడు గరిడె భుజంగరావు అన్నారు. సంగోజీవాడి గ్రామంలో మంగళవారం ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు, మహిళలు పార్టీలో చేరారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి, ధర్మారావ్‌పేట్, పద్మాజీవాడి, మర్కల్ గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులుగా బాధ్యతలు చేపట్టిన అడ్లూర్ ఎల్లారెడ్డి సీహెచ్.రాజును మహ్మద్‌నగర్ మండలం గాలిపూర్‌కు, ధర్మారావ్‌పేట్‌లో పంచాయతీ కార్యదర్శిగా పని చేసిన లింగంపేట్ మండలం అయ్యపల్లికి, పద్మాజీవాడిలో పంచాయతీ కార్యదర్శిగా పని చేసిన ప్రశాంత్‌ను ధర్మారావ్‌పేట్‌కు, మర్కల్‌లో పంచాయతీ కార్యదర్శిగా పని చేసిన స్రవంతిని గాంధారి మండలం కాయిత తండాకు బదిలీ చేసినట్లు ఎంపీడీవో సంతోష్‌కుమార్ తెలిపారు.
మండలానికి వచ్చిన కార్యదర్శులు...
అడ్లూర్ ఎల్లారెడ్డికి ఎస్.అనిత, పద్మాజీవాడికి కె.గంగాధర్, తుక్కోజీవాడికి ఎస్. రాజ్యలక్ష్మి, మర్కల్‌కు పి.నరేశ్, వజ్జపల్లి కుర్దుకు వై.రాములు వచ్చినట్లు తెలిపారు. వీరు మంగళవారం బాధ్యతలు స్వీకరించినట్లు పేర్కొన్నారు.
కామారెడ్డి అర్బన్: సైన్స్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక బి– టాపర్ హైస్కూల్‌లో నాలుగు రోజుల పాటు హ్యాండ్స్ ఆన్ సైన్స్ వర్క్‌షాప్ నిర్వహించగా మంగళవారం ముగిసింది. ఉపాధ్యాయులు తమ బోధన నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడంతో పాటు విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించడానికి వర్క్‌షాప్ నిర్వహించినట్టు జిల్లా సైన్స్ అధికారి సిద్దిరాంరెడ్డి తెలిపారు. ప్రతిభ చూపిన ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రతినిధులు ప్రవీణ్‌కుమార్, శ్రీకాంత్, సత్యానంద్, అమీర్ పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఎన్యుమరేటర్ల శిక్షణ మంగళవారంతో ముగిసినట్లు అధికారులు తెలిపారు. జనగణనకు సంబంధించి ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలిపారు.
కామారెడ్డి అర్బన్: రక్తదానం చేసే ప్రతి ఒక్కరు ప్రాణదాతలేనని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి అన్నారు. మంగళవారం స్థానిక శ్రీ కల్కి ఆలయంలో పలువురు రక్తదాతలకు హెల్మెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించగా జిల్లా కార్యదర్శి నాగరాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ బాలు, ఐవీఎఫ్, కామారెడ్డి రక్తదాతల సమూహం జిల్లా ప్రతినిధులు చంద్రశేఖర్, సుధాకర్, వెంకటేష్, యెల్లంకి సుదర్శన్, ఈశ్వర్, విజయ్‌కుమార్, గంగరాజం, రమేష్, దిగంబర్ పాల్గొన్నారు.
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్‌నగర్ మండలం తుంకిపల్లిలో సోమవారం వేర్వేరు భరత్ పార్టీలలో అర్ధరాత్రి అధిక సౌండ్‌తో ప్రజలకు ఆటంకం కల్గించిన ఇద్దరు డీజే నిర్వహకులపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై శివకుమార్ తెలిపారు.


