ఎల్లారెడ్డిరూరల్: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఆర్డీవో ప్రభాకర్ అన్నారు. మంగళవారం మత్తమాల, మాచాపూర్ గ్రామాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. తహసీల్దార్ ప్రేమ్‌కుమార్, సర్పంచ్‌లు శ్రీనివాస్‌గౌడ్, విజయ్ కుమార్ తదితరులున్నారు.
ధాన్యం సేకరణలో ఇబ్బందులు రానీయద్దు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ధాన్యం సేకరణ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని నాగిరెడ్డిపేట తహసీల్దార్ భిక్షపతి సూచించారు. తాండూర్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. కొనుగోలుకేంద్రంలో తగిన ఏర్పాట్లు చేయాలని సొసైటీ సీఈవో చంద్రమురళీని ఆదేశించారు.
కొనుగోలు కేంద్రం ప్రారంభం
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలం గిర్నితాండ గ్రామ పంచాయతీలో మంగళవారం ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకులు సవాయిసింగ్, సంతోష్ రాథోడ్, పంచాయతీ కార్యదర్శి గౌరి తదితరులు ఉన్నారు.


