ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చూస్తా | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చూస్తా

Apr 22 2026 7:18 AM | Updated on Apr 22 2026 7:18 AM

కామారెడ్డి టౌన్‌/మాచారెడ్డి/బీబీపేట/దోమకొండ/భిక్కనూరు: నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తానని ఎ మ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి హామీ ఇచ్చా రు. మంగళవారం కామారెడ్డి, మాచారెడ్డి, బీబీపేట, దోమకొండ, భిక్కనూరు మండలాల పరిధిలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల కింద మంజూరైన చెక్కులను ఆయన అందజేశారు. ఆడపిల్లల పెళ్లిళ్లు పేద కుటుంబాలకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఈ సాయం అందుతుందని ఆయన తెలిపారు. బీజే పీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement