రోటరీ సేవా కార్యక్రమాలు అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

రోటరీ సేవా కార్యక్రమాలు అభినందనీయం

Apr 22 2026 7:18 AM | Updated on Apr 22 2026 7:18 AM

అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌

కామారెడ్డి టౌన్‌: సమాజంలో వెనుకబడిన వర్గాల కు, దివ్యాంగులకు అండగా నిలుస్తూ రోటరీ క్లబ్‌ సే వా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అ దనపు కలెక్టర్‌ మధుమోహన్‌ అన్నారు. మంగళవా రం గర్గుల్‌లో ‘పీపుల్‌ ఫర్‌ ఇండియా’ స్వచ్ఛంద సంస్థ, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ కామారెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు, దివ్యాంగులకు వీల్‌ చైర్లు, బె డ్లు, కంప్యూటర్‌ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థినుల కు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మహిళలకు స్వ యం ఉపాధి లభించడం హర్షించదగ్గ విషయమన్నారు. రోటరీ అసిస్టెంట్‌ గవర్నర్‌ ఎం. జైపాల్‌ రెడ్డి మాట్లాడుతూ.. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్క రూ ఇలాంటి సేవల్లో భాగస్వాములు కావాలని పి లుపునిచ్చారు. ఎంఈవో ఆనంద్‌ రావు, గ్రామ స ర్పంచ్‌ దివ్య, పీఎఫ్‌ఐ వైస్‌ ప్రెసిడెంట్‌ అరవింద్‌, రో టరీ క్లబ్‌ ప్రెసిడెంట్‌ శంకర్‌, సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement