ఘనంగా మహాత్మా బసవేశ్వర జయంతి | - | Sakshi
Sakshi News home page

ఘనంగా మహాత్మా బసవేశ్వర జయంతి

Apr 21 2026 4:14 AM | Updated on Apr 21 2026 4:14 AM

కామారెడ్డి క్రైం: మహాత్మా బసవేశ్వర జయంతిని సోమవారం కల్టెకరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్లు విక్టర్‌, మధుమోహన్‌లు బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బసవేశ్వరుడు 12 వ శతాబ్దానికి చెందిన గొప్ప భారతీయ తత్వవేత్త, సంఘ సంస్కర్త, కవి, లింగాయత్‌ ధర్మ స్థాపకుడు అని పేర్కొన్నారు. కులవ్యవస్థ, లింగ వివక్ష, మూఢనమ్మకాలపై పోరాడిన మహనీయుడన్నారు. కష్టపడి పనిచేయడమే కైలాసం అనే సందేశంతో శారీరక శ్రమకు, నిజాయితీకి ప్రాధాన్యత ఇచ్చిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్‌, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జయరాజ్‌, సహాయ అభివృద్ధి అధికారి చక్రధర్‌, బహుజన సంఘాల నాయకులు మల్లయ్య, నాగరాజు, లింగాయత్‌ సమాజ ప్రతినిధి ప్రభాకర్‌, నాయకులు అశ్వక్‌, నరేష్‌, శాంతయ్య, స్వప్న, పవన్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement