ముంచిన నకిలీ విత్తనాలు | - | Sakshi
Sakshi News home page

ముంచిన నకిలీ విత్తనాలు

Apr 21 2026 4:14 AM | Updated on Apr 21 2026 4:14 AM

నష్టపరిహారం చెల్లించాలి

కేసులు నమోదు చేస్తాం

బాన్సువాడ : నకిలీ విత్తనాలు రైతులను నట్టేట ముంచాయి. ఈ కారణంగా బాన్సువాడ ప్రాంతంలో సుమారుగా 1200 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. బాన్సువాడకు చెందిన కొందరు రైతులతో పాటు హన్మాజీపేట్‌, నస్రుల్లాబాద్‌ మండలం మైలారం, దుర్కి, వర్ని మండలంలోని జలాల్‌పూర్‌ తదితర గ్రామాలకు చెందిన రైతులు కొత్త రకం విత్తనాలను సాగు చేయాలనే సంకల్పంతో పట్టణంలోని పాత అంగడిబజారు సమీపంలో ఉన్న ఓ ఫర్టిలైజర్‌ దుకాణంలో ధనలక్ష్మి సీడ్స్‌ కంపెనీకి చెందిన జేజీఎల్‌–1798 విత్తనాల బ్యాగులు కొనుగోలు చేశారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో ఈ విత్తనాలు వేస్తే అధిక దిగుబడులు వస్తాయని ఫర్టిలైజర్‌ వ్యాపారులు నమ్మబలికారు. ప్రభుత్వ అనుమతి పొందిన సీడ్స్‌ అని చెప్పి విత్తనాలను రైతులకు అంటగట్టారు. దీంతో రైతులు దిగుబడి బాగా వస్తే చాలని ధనలక్ష్మి సీడ్స్‌ బ్యాగులను కొనుగోలు చేశారు. నారుపోసి పంటలు సాగు చేశారు. చివరకు పంట కోత దశలోకి వచ్చే సరికి కొంత మేరలో ధాన్యం గింజలు ఎర్రబడటం, మరో కొంత భాగంలో ధాన్యం గింజలు పాలు తాగడం, మరో కొంత భాగం పొట్టదశలో ఉండడం జరిగింది. ఇలా మూడు దశలో పంట పూర్తిగా పొల్లు పోయింది. ప్రస్తుతం ఎకరానికి ఐదు క్వింటాళ్ల ధాన్యం వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. రైతులు కంగారు పడి విత్తనాలు కొనుగోలు చేసిన ఫర్టిలైజర్‌ వ్యాపారి వద్దకు వెళ్లి విషయం చెప్పడంతో జగిత్యాల నుంచి శాస్త్రవేత్తలను పిలిచి రైతుల పంటలను పరిశీలించారు. నష్టవాటిల్లిన పంటలను పరిశీలించి కొన్ని శ్యాంపిళ్లను ల్యాబ్‌కు పంపించారు. మాకు న్యాయం చేయాలని ఎరువుల దుకాణానికి వెళ్తే వ్యాపారి చేతులు దులుపుకుంటున్నారని రైతులు అంటున్నారు.

కొత్త రకం సీడ్స్‌ అని చెప్పా రు. దిగుబడి బాగానే వ స్తుందని చెప్పడంతో జేజీఎల్‌–1798 విత్తనాలు వే శాం. పంట కోత దశలో పూ ర్తిగా పొల్లుపోయి ఎండిపోయింది. అగ్గిపెడితే కాలిపోతుంది. ఫర్టిలైజర్‌ వ్యా పారే మాకు ఎకరానికి రూ.30 వేల నష్టపరిహారం చెల్లించాలి. –నారాయణ, రైతు, బాన్సువాడ

బాన్సువాడ చింతల్‌నాగారం శివారులో కొందరు రైతులు వేసిన పంటలు నష్టపోయినట్లు మా దృష్టికి వచ్చింది. ఈ విత్తనాలు సుమారు 1200 ఎకరాల్లో వేశారు. జగిత్యాల నుంచి శాస్త్రవేత్తలను పిలిపించాం. నష్టపోయిన పంటలను పరిశీలించి శ్యాంపిళ్లను సేకరించారు. ల్యాబ్‌కు పంపించారు. రెండు, మూడు రోజుల్లో రిపోర్టు రాగానే చర్యలు తీసుకుంటాం.

–మిఫ్ట ఫైజుల్లా, ఏవో, బాన్సువాడ

బాన్సువాడ ప్రాంతంలో

1200 ఎకరాల్లో వరి పంట నష్టం

మూడు దశల్లో పంట పొల్లు పోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు

చేతులు దులుపుకుంటున్న

ఫర్టిలైజర్‌ యజమాని

Advertisement
 
Advertisement
Advertisement