కార్పెంటర్‌ షాప్‌లపై అటవీశాఖ అధికారుల దాడులు | - | Sakshi
Sakshi News home page

కార్పెంటర్‌ షాప్‌లపై అటవీశాఖ అధికారుల దాడులు

Apr 21 2026 4:14 AM | Updated on Apr 21 2026 4:14 AM

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌) : భీమ్‌గల్‌ మండలం మెండోర గ్రామంలోని కార్పెంటర్‌ వర్క్స్‌ షాప్‌లపై అటవీశాఖ బాసర సర్కిల్‌ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలపతోపాటు యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వర్క్‌ షాప్‌ యజమానులపై కేసులు నమోదు చేసి విచారణ జరుతున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. దాడుల్లో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీం సభ్యులు అనిత, ఇతర సిబ్బందితోపాటు కమ్మర్‌పల్లి రేంజ్‌ అధికారులు ఎఫ్‌ఆర్‌వో రవీందర్‌, డీఆర్వోలు శ్రీనివాస్‌, దేవీదాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement