విద్యుదాఘాతంతో ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో ఒకరి మృతి

Apr 21 2026 4:14 AM | Updated on Apr 21 2026 4:14 AM

ఆర్మూర్‌టౌన్‌: ఆర్మూర్‌ మండలం ఖానాపూర్‌ గ్రామానికి చెందిన అక్కనపల్లి శివరాం(58)అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్‌ సోమవారం తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం శివరాం తన భూమిలో ఉన్న ఎర్రజొన్న సొప్పను తగలబెడుతున్నాడు. ప్రమాదవశాత్తు బోరుబావికి చెందిన పానెల్‌ బోర్డుకు మంటలు వ్యాపిస్తుండగా అందులోనుంచి కరెంటు వైర్లు తీసేందుకు శివరాం ప్రయత్నించాడు. అదే సమయంలో విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడిక్కకడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement