అంగన్‌వాడీ కేంద్రాలలో గ్యాడ్యుయేషన్‌ డే | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కేంద్రాలలో గ్యాడ్యుయేషన్‌ డే

Apr 21 2026 4:14 AM | Updated on Apr 21 2026 4:14 AM

అంగన్‌వాడీ కేంద్రాలలో గ్యాడ్యుయేషన్‌ డే ఫిజియోథెరపి శిబిరం పోలీస్‌ ప్రజావాణిలో 34 ఫిర్యాదులు భార్యను ఉపసర్పంచ్‌ వేధిస్తున్నాడని యువకుడి ఆత్మహత్యాయత్నం డిగ్రీ పరీక్ష కేంద్రాల తనిఖీ

ఎల్లారెడ్డిరూరల్‌: ఎల్లారెడ్డి పట్టణంలోని అంగన్‌వాడీ కేంద్రాలలో సోమవారం గ్రాడ్యుయేషన్‌ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులకు గ్రాడ్యుయేషన్‌ డే సందర్భంగా పట్టాలను సీడీపీవో ప్రసన్న అందించారు. సూపర్‌వైజర్లు హారతి, అంగన్‌వాడీ టీచర్‌ నీలారాణి తదితరులున్నారు.

పిట్లం(జుక్కల్‌): మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు సోమవారం ఫిజియోథెరపి క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఈఆర్‌పీ కమల్‌ కిషోర్‌ మాట్లాడుతూ.. ఫిజియోథెరపి క్యాంపులో భాగంగా ఇక్కడికి వచ్చిన వైద్యురాలు సారిక ఇంటి వద్ద చేసే వ్యాయామం గురించి దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు.

నిజామాబాద్‌ అర్బన్‌: పోలీస్‌ ప్రజావాణి కార్య క్రమంలో భాగంగా సోమవారం 34 ఫిర్యాదు లు స్వీకరించినట్లు సీపీ సాయిచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు సీపీని కలిసి తమ సమస్యలను విన్నవించారు. వెంటనే సంబంధి త పోలీసు అధికారులతో మాట్లాడి సమస్యల ను పరిష్కరించాలని ఆదేశించారు.

భిక్కనూరు: తన భార్యను ప్రజాప్రతినిధి వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ యువకుడు వాటర్‌ట్యాంక్‌ ఎక్కి ఆత్మహత్యకు యత్నించిన ఘటన భిక్కనూరు మండలం కంచర్ల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉపసర్పంచ్‌ రమేశ్‌ ఓ వివాహితను కొన్నిరోజులుగా వేధిస్తున్నాడు. దీంతో ఆమె విషయాన్ని తన భర్తకు తెలిపింది. మానసిక ఆవేదనకు గురైన యువకుడు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గ్రామానికి చెందిన వాట్సాప్‌ గ్రూపులో వాయిస్‌ మెసేజ్‌ పెట్టి వాటర్‌ ట్యాంక్‌ ఎక్కాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సదరు యువకుడిని సముదాయించి కిందకు దించారు. అనంతరం వివాహిత ఫిర్యాదు మేరకు ఉపసర్పంచ్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై వివరించారు.

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ వర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పరీక్షలు సోమవా రం ప్రశాంతంగా జరిగినట్లు అడకమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధి లో ఏర్పాటు చేసిన మొత్తం 29 పరీక్ష కేంద్రాల లో 5,375 మంది విద్యార్థులకు 5,183 మంది హాజరుకాగా 192 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను ప్రొఫెసర్‌ ఘంటా చంద్రశేఖ ర్‌ తనిఖీ చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, కాపీయింగ్‌కు అవకాశం ఇవ్వొద్ద ని ఇన్విజిలేటర్లకు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement