జొన్నలు కొనుగోలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

జొన్నలు కొనుగోలు చేయాలి

Apr 21 2026 4:14 AM | Updated on Apr 21 2026 4:14 AM

పెద్దకొడప్‌గల్‌(జుక్కల్‌): మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో సోమవారం భారత్‌ కిసాన్‌ సంఘం ఆ ధ్వర్యంలో జొన్నలు కొనుగోలు చేయాలని రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి పండించిన జొన్నలు అకాల వర్షాలకు తడిసిపోతున్నాయని వాపోయారు. వెంటనే జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ గంట సేపు రోడ్డుపై బైఠాయించా రు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ రాజశేఖర్‌ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి 4 రోజుల్లో కొనుగోలు ప్రక్రియ చేపడతామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.

కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని వినతి

లింగంపేట(ఎల్లారెడ్డి): మోతె గ్రామంలో జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సోమవారం మార్కుఫెడ్‌ డీఎం శశిధర్‌రెడ్డికి మోతె గ్రామ రైతులు వినతిపత్రం అందజేశారు. రైతులు వజీర్‌ అశోక్‌రావు, రాజిరెడ్డి, పందిరి రవి, రమేశ్‌, సుధాకర్‌గౌడ్‌, మహిపాల్‌రెడ్డి గదితరులు పాల్గొన్నారు.

సదాశివనగర్‌లో..

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): జొన్న, మొక్కజొన్న కేంద్రాలను ఏర్పాటు చేయాలని భారతీయ కిసాన్‌ సంఘ్‌ జిల్లా అధ్యక్షుడు విఠల్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రైతులకు మద్ధతుగా సోమవారం మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యూరియా యాప్‌ను ఏర్పాటు చేయడం వల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వెంటనే యాప్‌ను తొలగించాలని డిమాండ్‌ చేశారు. బీకేఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్‌ రావు, మండల అధ్యక్షుడు కొప్పుల నర్సారెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement