జిల్లా కేంద్రంలో బసవేశ్వరుడి చిత్రపటం వద్ద
నివాళులర్పిస్తున్న వీరశైవ లింగాయత్ సమాజ్ సభ్యులు
తాడ్వాయి మండలం చిట్యాలలో..
వీరశైవ లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో జిల్లాలో పలు చోట్ల సోమవారం మహాత్మా బసవేశ్వర మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బసవేశ్వరుడి విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ.. 12వ శతాబ్దంలోనే కుల వ్యవస్థ నిర్మూలనకు, అంటరానితనంపై పోరాటం చేసిన గొప్ప సంస్కర్త అని కొనియాడారు. సమాజంలో సమానత్వం కోసం ఆయన చేసిన కృషి వల్లనే ఆయన మహాత్ముడయ్యాడని అన్నారు. ప్రతి ఒక్కరూ బసవేశ్వరుడి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
– సాక్షి నెట్‌వర్క్


