దేశ సంక్షేమం, ధర్మ సంరక్షణ బీజేపీకే సాధ్యం | - | Sakshi
Sakshi News home page

దేశ సంక్షేమం, ధర్మ సంరక్షణ బీజేపీకే సాధ్యం

Apr 21 2026 4:14 AM | Updated on Apr 21 2026 4:14 AM

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పైడి ఎల్లారెడ్డి

భిక్కనూరు: దేశ సంక్షేమం, ధర్మ సంరక్షణ బీజేపీకే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పైడి ఎల్లారెడ్డి అన్నారు. సోమవారం రాజంపేట మండలం బసన్నపల్లిలో పలు గ్రామాలకు చెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వీరందరికి ఆయన బీజేపీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బీజేపీలో చేరడం అభినందనీయమన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని అప్పుడే అవినీతి అక్రమాలకు చెక్‌ పెట్టవచ్చన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అన్ని గ్రామాల్లో విజయదుందుబి మోగించాలని, ప్రతి కార్యకర్త మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్‌రావు, రాజంపేట మండలాధ్యక్షుడు సంపత్‌రెడ్డి, లింగంపెట బీజేపీ మండలాధ్యక్షుడు క్రాంతికుమార్‌, తాడ్వాయి మండలాధ్యక్షుడు సంతోష్‌రెడ్డి, ఎల్లారెడ్డి రూరల్‌ అధ్యక్షుడు నర్సింలు, బీజేపీ నేతలు గంగారెడ్డి, భాస్కర్‌రెడ్డి, యోగా రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement