విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులు సూచించారు. సోమవారం జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లను అధికారులు పరిశీలించారు. తాజా కూరగాయలు వాడాలని, మెనూ ప్రకారం భోజనం పెట్టాలని నిర్వాహకులకు సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల రికార్డులను పరిశీలించారు. – సాక్షి నెట్‌వర్క్
ఎల్లారెడ్డి మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో వాష్‌రూంలను పరిశీలిస్తున్న ఎంపీడీవో ప్రకాష్
భిక్కనూరు గురుకుల పాఠశాలలో వంటగదిని పరిశీలిస్తున్న ఎంఈవో రాజ్‌గంగారెడ్డి


