హత్యల కంటే రోడ్డుప్రమాదాల విషాదం ఎక్కువ | - | Sakshi
Sakshi News home page

హత్యల కంటే రోడ్డుప్రమాదాల విషాదం ఎక్కువ

Apr 19 2026 8:05 AM | Updated on Apr 19 2026 8:05 AM

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): హత్యల కంటే రోడ్డుప్రమాదాలు నింపే విషాదం చాలా ఎక్కువని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని లింగంపల్లికలాన్‌కు చెందిన నారుడి రాజు సహకారంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం పలువురు వాహనదారులకు ఆయన హెల్మెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహానాలు నడిపే ప్రతిఒక్కరూ రోడ్డుభద్రత నియమాలను పాటించాలన్నారు. హెల్మెట్ల దాత నీరడి రాజు, ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి, నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

పోలీస్‌ అధికారులను సత్కరించిన

ఆటోయూనియన్‌ సభ్యులు

నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్‌పేట బీఎంఎస్‌ ఆటో యూనియన్‌ కార్యవర్గ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రాజారెడ్డి, ఎస్సై భార్గవ్‌గౌడ్‌ను సత్కరించారు. ఇటీవల నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో మర్యాదపూర్వకంగా వారు పోలీసులను కలిశారు. అనంతరం పోలీస్‌ అధికారులకు శాలువాలను కప్పి సత్కరించారు. ఆటోయూనియన్‌ అధ్యక్షుడు జానీ, ఉపాధ్యక్షుడు కృష్ణ, కోశాధికారి సుధాకర్‌, సలహాదారులు అనిల్‌, అశోక్‌, రమేష్‌, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement