నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఎండతీవ్రం కాకముందే ఉపాధిపనిని పూర్తిచేసుకోవాలని నాగిరెడ్డిపేట ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ సూచించారు. మండలంలోని బొల్లారంలో శనివారం ఉపాధికూలీలతో ఆయన సమావేశమయ్యారు. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో పనులు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఇంటి నుంచి తెచ్చుకునే బాటర్‌బాటిళ్లల్లో ఓఆర్‌ఎస్ పౌడర్ కలుపుకోవాలని ఆయన సూచించారు. గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఆయనవెంట పంచాయతీ కార్యదర్శి సంతోష్, ఫీల్డ్‌అసిస్టెంట్ పర్వీన్ ఉన్నారు.
కూలీలకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలం గాలీపూర్ గ్రామంలో ఉపాధి కూలీలకు శనివారం గ్రామ సర్పంచ్ సాయికిరణ్ ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఎండదెబ్బ బారిన పడకుండా ముందుజాగ్రత్తలు పాటించాలని కూలీలకు సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు ప్రభాత, స్వప్న, ీఫీల్డ్‌అసిస్టెంట్ రాములు తదితరులున్నారు.


