పంట నష్టపరిహారం ఇవ్వాలని రైతుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

పంట నష్టపరిహారం ఇవ్వాలని రైతుల ధర్నా

Apr 19 2026 7:53 AM | Updated on Apr 19 2026 7:53 AM

భిక్కనూరు: గత నెలలో కురిసిన ఆకాల వర్షాలకు వరిపంట దెబ్బతిందని నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామ రైతు వేదిక ముందర రైతులు శనివారం ధర్నా నిర్వహించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అధికారులు నేతలు నష్టపరిహరం ఇప్పిస్తామని హామీలు ఇచ్చి మరిచిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహరం చెల్లించాలంటూ గంట పాటు నిరసన తెలిపారు. ఏఈవో లత వారి ఉన్నతాధికారులకు సమాచారం అందించానని, ప్రభుత్వానికి కూడా తాము 600 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని నివేదిక ఇచ్చామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సముదాయించడంతో వారు శాంతించి ధర్నాను విరమించారు.

Advertisement
 
Advertisement
Advertisement