● బాధ్యతగా వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ
● కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి
భిక్కనూరు: వాహనం నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ కుటుంబాన్ని గుర్తుంచుకోవాలని ఏఎస్పీ చైతన్యరెడ్డి అన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలితీసుకుంటుందని ప్రతి ఒక్కరూ బాధ్యతంగా వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు. భిక్కనూరులోని ఎస్వీ గార్డెన్స్‌లో శనివారం నిర్వహించిన అరైవ్–ఆలైవ్ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కామారెడ్డి ఉగ్రవాయి వద్ద రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో.. ప్రమాదాల కారాణాలను గుర్తించి ఎస్పీ రాజేశ్‌చంద్ర సూచనలతో అక్కడ ప్రమాద చిహ్నలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి ప్రమాదం జరుగలేదన్నారు. గ్రంథాలయసంస్థ చై ర్మన్ చంద్రకాంత్‌రెడ్డి మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రై వ్ పరీక్షలను ముమ్మరంగా నిర్వహించాలని, మద్యం సేవించి వాహనాలను నడిపిన వారికి జరిమానాలను విధించాలని సూచించారు.
కన్నీటి పర్యంతమైన మహిళ సర్పంచ్‌లు
ఆరైవ్–ఆలైవ్ కార్యక్రమంలో ఇద్దరూ మహిళ సర్పంచులు వేదికపైననే కన్నీటి పర్యంతమయ్యారు. రోడ్డు ప్రమాదాలతోనే మృతి చెందిన వారి కుటుంబాల పరిస్థితి ఎంత దయనీయంగా మారుతుందో పోలీస్ కళాబృందం పాటల రూపంలో వివరించింది. ఈ సందర్బంగా భిక్కనూరు సర్పంచ్ బల్యాల రేఖ మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి 1న తన అ ల్లుడు కామారెడ్డిలో పొగమంచులో కారు న డుపుతూ మృతి చెందాడని ఆ బాధ తమ కుటుంబం అనుభవిస్తుందని కన్నీటి పర్యంతమయ్యారు. బస్వాపూర్ సర్పంచ్ పద్మ మాట్లాడుతూ తమ ఇంటి సమీపంలో వినయ్ అనే యువకుడు రోడ్డుప్రమాదంలో గాయపడటంతో ఆ కుటుంబం పరిస్థితి దయనీయంగా ఉందని బోరున విలపించారు.
250 మందికి హెల్మెట్‌ల పంపిణీ
మండలకేంద్రం సమీపంలో ఉన్న ఎంఎస్‌ఎన్ ఫ్యా క్టరీ యాజమాన్యం సహకారంతో 18 గ్రామాల యువకులు,వృద్ధులకు 250 హెల్మెట్లను ఏఎస్పీ చై తన్యరెడ్డి పంపిణీ చేశారు. హెల్మెట్ తీసుకున్నవారి పేర్లను తాము నమోదు చేసుకున్నామని వారు హె ల్మెట్ ధరించకుండా దొరికితే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.తదుపరి రోడ్డు భద్రత నిబందనలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. సీఐ సంపత్‌కుమార్, ఎస్సై ఆంజనేయులుతో పాటు అన్ని గ్రామాల సర్పంచ్‌లు,ఉపసర్పంచ్‌లు వార్డు సభ్యులు యువకులు పాల్గొన్నారు.
సౌత్‌క్యాంపస్‌లో..
తెలంగాణ యూనివర్సీటీ సౌత్‌క్యాంపస్‌లో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆరైవ్–ఆలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సురక్షితమైన ప్రయాణంతో ప్రాణాలను కాపాడుకోవచ్చని ఏఎంవీఐలు మధుకర్, కృష్ణతేజలు అన్నారు. రోడ్డు నిబంధలను పాటిస్తామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు.


