సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ఆదివారం నిర్వహించే 6–10వ తరగతిలో ప్రవేశ పరీక్ష కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రిన్సిపాల్ రాజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 6వ తరగతిలో ప్రవేశం పొందుటకు వంద సీట్లకు గాను 372 మంది పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశం పొందుటకు 272 మంది పరీక్షలు రాయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మోడల్‌స్కూల్‌లో నేడు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ గాంఽధీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప రీక్షకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో పరీ క్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన కోరారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి): దేశ సంస్కృతిని కాపాడుకోవల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుపై ఉందని ఆర్‌ఎస్‌ఎస్ ఇందూర్ విభాగ్ ప్రచారక్, తెలంగాణ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ నర్రా వెంకట శివకుమార్ అన్నారు. మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డిలోని ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం రాత్రి జరిగిన విరాట్ హిందూ సమ్మేళన కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. విరాట్ హిందూ సమ్మేళన కార్యక్రమ నిర్వహకులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.
నిజాంసాగర్(జుక్కల్): హిందువుల్లో ఐక్యత కోసం హిందూ సమ్మేళనాలు అని సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం మహమ్మద్‌నగర్ మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్ హాల్‌లో హిందూ సమ్మేళన ఏర్పాట్లను ఆయన పరి శీలించి మాట్లాడారు. హిందూ సమ్మేళన సభ్యులు రవికిరణ్, భానుప్రకాష్, మోహన్,శ్రావణ్,రాజాగౌడ్, నాగరాజు, కార్తిక్, ఓంకార్, రాములు, మనీ తదితరులున్నారు.
ఎల్లారెడ్డి: ఎస్‌ఐఆర్‌పై పోలింగ్‌కేంద్రాల వారిగా ఓటర్లకు అవగాహన కల్పించాలని ముస్లిం వెల్ఫేర్ నాయకులు శనివారం ఆర్డీవో ప్రభాకర్‌కు వినతిపత్రం అందించారు. బీఎల్‌వోలను నియమించి వారికి ఎస్‌ఐఆర్‌పై అవగాహన కల్పించాలని అన్నారు. 2002 కంటే ముందు ఉన్న ఓటరు లిస్టు ఆధారంగా సర్వే నిర్వహించాలన్నారు. మాజీ జడ్పీటీసీ గయాజుద్దిన్, యూనుస్ తదితరులున్నారు.


