క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Apr 19 2026 7:53 AM | Updated on Apr 19 2026 7:53 AM

బాలుడి హత్య కేసులో తల్లి, ప్రియుడి అరెస్ట్‌ అదృశ్యమైన యువకుడు.. శవమై తేలాడు

కామారెడ్డి క్రైమ్‌: వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ఐదేళ్ల బాలుడి దారుణ హత్య కు పాల్పడిన తల్లి, ఆమె ప్రియుడిని పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టణ పోలీస్‌ స్టేషన్లో ఎస్‌హెచ్‌వో నరహరి వివరాలు వెల్లడించారు. రాజంపేట మండలానికి చెందిన రజిత అలియాస్‌ లక్ష్మి తన భర్తతో గొడవపడి ఆరు నెలలుగా కామారెడ్డిలోని శ్రీరాంనగర్‌ కాలనీలో నివాసం ఉంటుంది. ఆమెకు కుమార్తె, కుమారుడు శ్రావణ్‌ (05) ఉన్నారు. లక్ష్మీనరసింహులు అనే వ్యక్తితో లక్ష్మి కొంతకాలంగా సహజీవనం చేస్తుంది. తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి శ్రావణ్‌ హత్యకు వారిద్దరూ కలిసి కుట్ర పన్నారు. శుక్రవారం లక్ష్మి కూలీ పనులకు బయటకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చిన లక్ష్మీనరసింహులు శ్రావణ్‌ గొంతు పిసికి, నేలకేసి బాది దారుణంగా హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం వారిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి

ఎల్లారెడ్డి: నిజాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌లో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెందాడు. వివరాలు ఇలా.. ఎల్లారెడ్డి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన మాటూరి మల్లేష్‌(33), మిత్రుడు సా యితో కలిసి శనివారం రుద్రారం గ్రామశివారులోని నిజాంసాగర్‌ బ్యాక్‌ వాటర్‌లో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపలు పట్టేక్రమంలో మల్లేష్‌ వలను పట్టుకొని మరో గట్టుకు వెళ్తుండగా వల కాళ్లకు చుట్టుకుంది. దీంతో అతడు ఈత కొట్టలేక నీటిలో మునిగి మృతిచెందాడు. మృతుడి భార్య సౌజన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

నవీపేట: అదృశ్యమైన ఓ యువకుడు గోదావరి నదిలో శవమై తేలాడు. ఎస్సై శ్రీకాంత్‌ తెలిపిన వివరాలు ఇలా.. నిర్మల్‌ జిల్లా ముధోల్‌ మండలం చించాలం గ్రామానికి చెందిన గట్టుపల్లి రంజిత్‌ (36) కొన్నేళ్లుగా నిజామాబాద్‌ జిల్లా బోర్గాం వద్ద గల ఐసీడీఎస్‌ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నాడు. వచ్చే నెల 8న అతడికి వివాహం జరగాల్సి ఉంది. ఈనెల 15న అతడు భీంగల్‌లోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి బైక్‌పై వెళ్లాడు. మళ్లీ తిరిగి ఇంటికి రాలేదు. ఆచూకీ తెలియకపోవడంతో ముధోల్‌ పీ ఎస్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్‌ కేసు నమోదైంది. శనివారం ఉదయం గోదావరి నదిలో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రంజిత్‌ మృతదేహంగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. యువకుడి మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement