హెల్మెట్‌ ధరించి ప్రయాణించాలి | - | Sakshi
Sakshi News home page

హెల్మెట్‌ ధరించి ప్రయాణించాలి

Apr 19 2026 7:53 AM | Updated on Apr 19 2026 7:53 AM

పిట్లం(జుక్కల్‌): ప్రతి ద్విచక్ర వాహనదారుడు కచ్చితంగా హెల్మెట్‌ ధరించి ప్రయాణించాలని ఎస్సై ఆంజనేయులు శనివారం పిట్లంలో విస్తృతంగా ప్రచారం చేశారు. మండల కేంద్రంలోని శివాజీ చౌక్‌ వద్ద వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్‌ ధరించి వాహనాలు నడుపుతున్న వారికి పువ్వులు ఇచ్చి అభినందించారు. హెల్మెట్‌ ధరించని వారి చెవులలో పువ్వులు పెట్టి ప్రాణాలమీదకు తెచ్చుకొవొద్దని సూచించారు. కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

బీబీపేట: మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై చేపట్టిన వాహనాల తనిఖీలో ఎస్సై విజయ్‌ అధ్వర్యంలో వాహనదారులకు గులాబీ పూలను ఇస్తూ ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. వినూత్నంగా ప్రతి వాహనదారునికి పూలను అందిస్తూ వాహనం నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రయాణికుల భద్రత కోసం పోలీసుల తనిఖీలని ఎస్సై విజయ్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement