పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం

Apr 18 2026 7:47 AM | Updated on Apr 18 2026 7:47 AM

డీఎల్‌పీవో శ్రీనివాస్‌

భిక్కనూరు: పరిసరాల పరిశుభ్రత పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని డీఎల్‌పీవో శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం భిక్కనూరు మండల కేంద్రంలో 16వ వార్డులో మురికి కాలువల నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం మురికి కాలువలు, సిమెంట్‌ రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అన్ని వీధుల్లో మురికి కాలువలను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్మిస్తామన్నారు. ప్రజలు చెత్తను వీధుల్లో వేయకుండా చెత్త ట్రాక్టర్‌, బండి వచ్చినప్పుడు అందులో వేయాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్‌ బల్యాల రేఖ మాట్లాడుతూ..ప్రభుత్వం మండల కేంద్రం అ భివృద్ధికి రూ.5.32 కోట్లను మంజూరు చేసింద న్నారు. ఎంపీడీవో రాజ్‌కిరణ్‌రెడ్డి, ఈవో మహేష్‌ గౌడ్‌, ఉప సర్పంచ్‌ మోహన్‌రెడ్డి, వార్డు సభ్యులు కర్రొల్ల రాజు, మనీషా, సురేష్‌, రవి, వేణు, నేతలు సుదర్శన్‌, లింబాద్రి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement