● ఇబ్బందులు పడుతున్న రైతన్నలు
మద్నూర్(జుక్కల్): రైతులు ప్రభుత్వ కాంటాలో శనగ పంట తూకం వేసి రోజులు గడుస్తున్నా శనగ బస్తాలను మాత్రం గోదాముకు తరలించడం లేదు. ఇదేమిటని అధికారులను అడిగితే లారీలు రావడం లేదని చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ యార్డులో సహకార సంఘం ఆధ్వర్యంలో శనగ పంట కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి కొనుగోలు చేసి తూకం వేసిన శనగ బస్తాలు అలాగే ఉన్నాయని లారీలో బస్తాలు తరలించే వరకు రైతుల బాధ్యత ఉంటుందని అధికారులు చెప్పడంతో శనగ బస్తాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. గతంలో మార్కెట్‌లో తూకం వేసిన బస్తాలు చోరీకి గురికావడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. వర్షంతోనూ రైతులు ఆందోళనకు గురువుతున్నారు.


