దోమకొండ:విద్యార్థులు మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని అంబారిపేట గ్రామ సర్పంచ్ అరుట్ల కవిత అనిల్ అన్నారు. శుక్రవారం గ్రామంలో మహనీయుల జీవితాలకు సంబంధించిన పుస్తకాలను పంచాయతి సెక్రటరీ నిమ్మ జీవన్ ఉచితంగా అందించగా ఆమె పాల్గొని మాట్లాడారు. జ్యోతిబాపూలే,సావిత్రిబాయి పూలే, భాగ్యరెడ్డి వర్మ, అంబేడ్కర్,కాన్షీరాం జీవిత చరిత్రలు, భారత రాజ్యాంగ పుస్తకాలు పంపిణీ చేశారు. పుస్తకాలు చదివి సమాజం పట్ల బాధ్యతగా ఉండి జీవితాలను సరైన మార్గంలో ప్రయాణించేలా చూసుకోవాలని పేర్కొన్నారు. మాజీ ఎంపీటీసీ పిరంగి రాజేశ్వర్, అంబేడ్కర్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.


