సాక్షి నెట్‌వర్క్:తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక – పెన్షనర్ల సంయుక్త కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఆర్డీవో, తహసీల్ కార్యాలయాల్లో నేతలు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఉద్యోగులకు సంబంధించి 2వ వేతన సవరణ కమిషన్ సిఫారసుల అమలు, హెల్త్ కార్డుల మంజూరు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, పాత పెన్షన్ పథకం పునరుద్ధరణతో పాటు 63 డిమాండ్లపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలు చోట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించారు.


