బాన్సువాడ రూరల్: తాడ్కోల్ గ్రామ రైతువేదికలో శుక్రవారం మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎంపీవో సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మాస్టర్ ట్రైనర్లు 15వ ఆర్థిక సంఘం నిధుల మంజూరు, అభివృద్ధి పనుల విధానం, పారదర్శకత, లెక్కల నిర్వహణ తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లకు ఎంతో కీలకమైన సదస్సుకు 25 గ్రామ పంచాయతీల నుంచి 12 మంది సర్పంచ్‌లు మాత్రమే హాజరుకావడం గమనర్హం.
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటివల పోలీసులు డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహించ గా, పలువురు మద్యం తాగి వాహనాలు నడుపు తూ పట్టుబడ్డారు. పోలీసులు శుక్రవారం ముగ్గురిని ఆర్మూర్ కోర్టులో హాజరుపర్చారు.జడ్జి వారిలో ఇద్దరికి రూ.10వేల చొప్పున జరిమానా విధించగా, ఒకరికి నాలుగు రోజుల సాధారణ జైలు శిక్ష విధించి నట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు.
రేషన్ బియ్యం పట్టివేత
నిజామాబాద్ అర్బన్: నగరంలోని వినాయక్‌నగర్‌లో రేషన్ బియ్యం పట్టుకున్నట్లు సీసీఎస్ ఏసీపీ మస్తాన్‌అలీ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు మెకానిక్ షెడ్‌లో దాడులు నిర్వహించి, ని ల్వఉంచిన 8.5 క్వింటాళ్ల రేషన్‌బియ్యంను స్వాధీ నం చేసుకున్నట్లు తెలిపారు. బియ్యంను అక్రమంగా తరలిస్తున్న మిర్జాఅబ్బాస్‌మేగ్‌ను అదుపులోకి తీసుకొని 4వ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించినట్లు తెలిపారు.
పెద్దకొడప్‌గల్(జుక్కల్):మండలంలోని అంజని చౌ రస్తాలో శుక్రవారం పోలీసులు వాహనాల తనిఖీ చే స్తుండగా, అక్రమంగా బియ్యం తరలిస్తున్న లారీ ప ట్టుబడింది.గుంటూరు నుంచి గుజరాత్‌కు అక్రమంగా తరలిస్తున్న 720 బస్తాల బియ్యం లారీని పట్టు న్నట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. డ్రైవర్‌పై కే సు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై తెలిపారు.


