క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Apr 18 2026 7:47 AM | Updated on Apr 18 2026 7:47 AM

గొర్రెల మందను ఢీకొన్న బస్సు నాగిరెడ్డిపేటలో ఒకరి ఆత్మహత్య లైన్‌మన్‌పై ఫిర్యాదు

కరెంట్‌ షాక్‌తో ఒకరి మృతి

ఎల్లారెడ్డి: మండలంలోని హాజిపూర్‌ గ్రామంలో ఓ వ్యక్తి కరెంట్‌ షాక్‌తో మృతిచెందాడు. వివరాలు ఇలా.. హాజీపూర్‌ గ్రామానికి చెందిన రాజిరెడ్డి(47) శుక్రవారం ఇంట్లో ఉన్న కూలర్‌ను రిపేర్‌ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌ తగిలి, మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పది గొర్రెలు మృతి

రామారెడ్డి (ఎల్లారెడ్డి): రామారెడ్డి శివారులో శుక్రవారం రోడ్డు దాటుతున్న గొర్రెల మందను అన్నారం నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇసన్నపల్లి గ్రామంలోని దోకి లచ్చయ్యకు చెందిన పది గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో సుమారు రూ. లక్ష వరకు నష్టం జరిగినట్టు బాధితుడు పేర్కొన్నాడు. బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావడంతోనే ఘటన జరిందని స్థానికులు తెలిపారు.

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా.. నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన కుమ్మరి పోచయ్య(54)అనే వ్యక్తి మూడునెలల క్రితం సైకిల్‌ పైనుంచి పడటంతో కాలికి గాయమైంది. పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా గాయం తగ్గలేదు. దీంతో మానసికంగా, శారీరకంగా బాధపడుతూ శుక్రవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై భార్గవ్‌గౌడ్‌ తెలిపారు.

నవీపేట: మండలంలోని జన్నేపల్లి గ్రామంలో విద్యుత్‌శాఖ సిబ్బంది నిర్లక్ష్యంతో పెంట లక్ష్మి అనే మహిళ మృతి చెందిందని, వారిపై చర్యలు తీసుకోవాలని జన్నేపల్లి గ్రామస్తులు శుక్రవారం ఎస్సై శ్రీకాంత్‌కు ఫిర్యాదు చేశారు. ట్రాన్స్‌కో ఏఈతోపాటు లైన్‌మన్‌ రమేష్‌కు కరెంటు సరఫరాలోని సాంకేతిక లోపాలపై గతంలో పలుమార్లు ఫిర్యాదు చేశామన్నారు. కానీ వారు ఫిర్యాదులపై స్పందించకపోవడంతో కరెంటు షాక్‌కు గురై లక్ష్మి మృతిచెందిందన్నారు. దీంతో ఆమె మృతికి కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement