కామారెడ్డి టౌన్:ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డి మాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఈనెల 22 నుంచి చేపట్టబోయే నిరవధిక సమ్మెకు మద్దతుగా శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ డిపో ముందు జేఏసీ ఆ ధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు,కార్మికులు సమ్మె కరపత్రాలను ఆవిష్క రించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఎన్నికల హామీలైన ఆర్టీసీ విలీనం,ప్రభుత్వ ఉద్యోగులతో సమాన జీతా లు, రెండు పీఆర్సీల అమలు చేయలేదన్నారు. 18 వేల ఖాళీలను భర్తీ చేయకుండా, ఉన్న సిబ్బందిపై పనిభారం పెంచి శ్రమదోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో సంస్థను ప్రైవేటీకరించే కుట్రలను ఆపాలని డిమాండ్ చేశా రు. ప్రభుత్వం స్పందించకుంటే సమ్మె తప్పదని హెచ్చరించారు. జేఏసీ నాయకులు వీఆర్ రెడ్డి, వీడీ దాస్, వెంకటగౌడ్, శ్రీనివాస్, సంజీవ్, రమేష్, రా జు,చారీ,లింగం,కృష్ణమూర్తి,సుల్తానా,సునంద, బా లలక్ష్మి, లలిత, మంజుల, తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి ఆర్టీసీ డిపో ముందు ధర్నా చేస్తున్న కార్మికులు


