నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి.. | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి..

Apr 18 2026 7:29 AM | Updated on Apr 18 2026 7:29 AM

నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి..

రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీస్‌ శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రమాదాలు ఆగడం లేదు. వాహనదారుల చిన్నపాటి నిర్లక్ష్యం, అజాగ్రత్తల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. నిర్లక్ష్యం, అతివేగం, నిబంధనలు పాంచకపోవడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. హెల్మెట్‌ ధరించకపోవడంతో ప్రమాదాలు జరిగినపుడు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాళ్లు, చేతులు విరిగినా ప్రాణాలు దక్కాలంటే తలకు గాయాలు కాకుండా ఉండాలి. ప్రమాద ఘటనల్లో హెల్మెట్‌ లేక తలకు బలమైన గాయాలై చనిపోతున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. పోలీసులు సైతం దీనిపై కళాబృందాల ద్వారా గ్రామస్థాయిలో ప్రదర్శనలు ఇస్తూ విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. అయినా చాలామంది హెల్మెట్‌ ధరించే విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ కూడా రోడ్డు ప్రమాదాలకు మరో ప్రధాన కారణంగా నిలుస్తోంది. భారీ వాహనాలను రోడ్డు పక్కన నిలిపే సమయాల్లో చేసే నిర్లక్ష్యం కారణంగా కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసులు మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement